దక్షిణాఫ్రికాలో భారత్‌ షెడ్యూల్‌ ఇదే

ABN , First Publish Date - 2021-12-07T06:04:54+05:30 IST

సవరించిన టీమిండియా పర్యటన షెడ్యూల్‌ను క్రికెట్‌ దక్షిణాఫ్రికా సోమవారం ప్రకటించింది.

దక్షిణాఫ్రికాలో భారత్‌ షెడ్యూల్‌ ఇదే

జొహాన్నెస్‌బర్గ్‌: సవరించిన టీమిండియా పర్యటన షెడ్యూల్‌ను క్రికెట్‌ దక్షిణాఫ్రికా సోమవారం ప్రకటించింది. తొలుత నిర్ణయించిన ప్రకారం సఫారీలతో భారత్‌ తొలి టెస్ట్‌ను ఈనెల 17 నుంచి ఆడాలి. కానీ, ఇక్కడ ఒమైక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో సిరీ్‌సను వారం ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఇరుజట్ల మధ్య మొదటి టెస్ట్‌ ఈనెల 26 నుంచి జరగనుంది. సఫారీ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో భారత్‌ మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. 


సవరించిన తాజా షెడ్యూల్‌

తొలి టెస్ట్‌ డిసెంబరు 26-30 సెంచూరియన్‌

రెండో టెస్ట్‌ జనవరి 3-7 జొహాన్నెస్‌బర్గ్‌

మూడో టెస్ట్‌ జనవరి 11-15  కేప్‌టౌన్‌


తొలి వన్డే జనవరి 19 పార్ల్‌

రెండో వన్డే జనవరి 21 పార్ల్‌

మూడో వన్డే జనవరి 23 కేప్‌టౌన్‌

Updated Date - 2021-12-07T06:04:54+05:30 IST