Tokyo Olympics: ఫైనల్స్ చేరిన భారత యువ షుటర్ సౌరభ్
ABN , First Publish Date - 2021-07-24T17:35:33+05:30 IST
విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అదరగొట్టాడు.

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ మొత్తం 586 పాయింట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మొత్తం ఆరు రౌండ్లలో సౌరభ్ వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. మొత్తం 36 మంది పోటీపడగా సౌరభ్ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత షూటర్ అభిషేక్ వర్మ 575 పాయింట్లతో 17వ స్థానానికి పరిమితం అయ్యాడు. దీంతో ఆయన ఈ పోటీల నుంచి నిష్క్రమించాడు. ఇక ఫైనల్స్ చేరిన సౌరభ్ అక్కడ కూడా ఇదే దూకుడు కనబరిస్తే భారత్ ఖాతాలో పతకం చేరడం ఖాయం.