‘కతార్‌’ మెయిన్‌ డ్రాకు సాయికార్తీక్‌

ABN , First Publish Date - 2021-12-30T07:36:20+05:30 IST

తెలుగు కుర్రాడు గంటా సాయికార్తీక్‌ రెడ్డి కతార్‌లోని దోహాలో జరుగుతున్న ఐటీఎఫ్‌ పురుషుల 15 కే టెన్నిస్‌ టోర్నమెంట్‌లో

‘కతార్‌’ మెయిన్‌ డ్రాకు సాయికార్తీక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు కుర్రాడు గంటా సాయికార్తీక్‌ రెడ్డి కతార్‌లోని దోహాలో జరుగుతున్న ఐటీఎఫ్‌ పురుషుల 15 కే టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సింగిల్స్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్లో సాయికార్తీక్‌ 6-3, 3-6, 10-8తో పొపివిక్‌ స్టీవెన్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. ఇక, డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సాయికార్తీక్‌-బవ హదీబ్‌ జోడీ 2-6, 7-6, 3-10తో చైనీస్‌ తైపీ జంట హువాంగ్‌-లున్‌కాను చేతిలో ఓటమిపాలైంది. 

Updated Date - 2021-12-30T07:36:20+05:30 IST