సచిన్.. 21వ శతాబ్దపు టెస్ట్ బ్యాట్స్‌మన్
ABN , First Publish Date - 2021-06-21T10:42:17+05:30 IST
‘ఇరవై ఒకటో శతాబ్దపు గొప్ప టెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరు ?’ అని స్టార్‌స్పోర్ట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో కామెంటేటర్లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, కోచ్‌లు, ఫ్యాన్స్..
న్యూఢిల్లీ: ‘ఇరవై ఒకటో శతాబ్దపు గొప్ప టెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరు ?’ అని స్టార్‌స్పోర్ట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో కామెంటేటర్లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, కోచ్‌లు, ఫ్యాన్స్.. టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్‌కు జై కొట్టారు. 70.3 శాతం ఓట్లు సాధించిన టెండూల్కర్ ఈ రేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను వెనక్కునెట్టాడు. సచిన్, సంగక్కరతోపాటు స్టీవ్ స్మిత్, జాక్వెస్ కలిస్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ‘ఓటింగ్ పోటాపోటీగా సాగింది. సచిన్, సంగక్కర ఇద్దరూ క్రికెట్ దిగ్గజాలే. కానీ 21వ శతాబ్దపు గొప్ప టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నా ముంబై సహచరుడు సచిన్ నిలిచాడు’ అని ఓటింగ్‌ను నిర్వహించిన గవాస్కర్ వెల్లడించాడు.