T20 World Cup: విండీస్‌కే అవకాశాలు: సబా కరీం
ABN , First Publish Date - 2021-09-19T02:46:08+05:30 IST
టీ20 ప్రపంచకప్ టైటిల్ విజేతపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదివారం (సెప్టెంబరు 19) నుంచి ఐపీఎల్
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ టైటిల్ విజేతపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదివారం (సెప్టెంబరు 19) నుంచి ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, అది పూర్తయిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు వెళ్లే సత్తా ఉన్న జట్లు ఏవన్న దానిపై అప్పుడే ఎవరి అభిప్రాయాలను వారు పంచుకుంటున్నారు.
తాజాగా, టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. డిఫెండింగ్ చాంపియన్ విండీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. అలాగే, ఇంగ్లండ్, టీమిండియాలు సెమీస్ చేరుకుంటాయని అంచనా వేశాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో స్థానం కోసం పోటీ ఉంటుందని పేర్కొన్నాడు. గత విజేత అయిన కీరన్ పొలార్డ్ సేన ఈసారి కూడా ఆ ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందని కరీం అభిప్రాయపడ్డాడు.