రెండు రోజుల్లో రెండు వరల్డ్ రికార్డులు
ABN , First Publish Date - 2021-05-20T08:59:45+05:30 IST
రష్యా స్విమ్మర్ క్లిమెంట్ కొలెష్నికోవ్ వరుసగా రెండు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలుగొట్టి ఔరా అనిపించాడు. యూరోపియన్ చాంపియన్‌షి్‌పలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల 50 మీ...

- రష్యా స్విమ్మర్ ఘనత
బుడాపెస్ట్: రష్యా స్విమ్మర్ క్లిమెంట్ కొలెష్నికోవ్ వరుసగా రెండు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలుగొట్టి ఔరా అనిపించాడు. యూరోపియన్ చాంపియన్‌షి్‌పలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో అతడు 23.80 సెకన్లలో గమ్యం చేరి కొత్త వరల్డ్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించాడు. తద్వారా.. ఒకరోజు ముందు ఈ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును (23.93 సె.) 0.13 సెకన్ల తేడాతో సవరించాడు.