‘2011’ బ్యాట్‌కు రూ.18 లక్షలు

ABN , First Publish Date - 2021-12-26T09:19:46+05:30 IST

పదేళ్ల క్రితం ధోనీ నాయకత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన సంగతి గుర్తుందిగా! ఆరోజు ఫైనల్‌

‘2011’ బ్యాట్‌కు రూ.18 లక్షలు

న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం ధోనీ నాయకత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన సంగతి గుర్తుందిగా! ఆరోజు ఫైనల్‌ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా కలిసి ఓ బ్యాట్‌పై సంతకాలు చేశారు. దానికి 2011 వరల్డ్‌కప్‌ టీమిండియా విన్నింగ్‌ టీమ్‌ క్రికెట్‌ బ్యాట్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు ఆ బ్యాట్‌కు దుబాయ్‌లో జరిగిన వేలంలో రూ. 18 లక్షల ధర పలకడం విశేషం. ఇక.. సచిన్‌ టెండూల్కర్‌ 200 టెస్ట్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్‌ క్రికెట్‌ కలెక్షన్స్‌ పేరుతో ఉన్న డిజిటల్‌ రైట్స్‌కు రూ. 30 లక్షలు, 2016 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ విజేతగా నిలిచిన సందర్భంగా జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సంతకం చేసిన జెర్సీకి రూ. 22 లక్షల ధర పలికాయి.  

Updated Date - 2021-12-26T09:19:46+05:30 IST