టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు సృష్టించిన రూట్

ABN , First Publish Date - 2021-02-06T21:36:40+05:30 IST

ఇంగ్లండ్ జట్టు టెస్ట్ కెప్టెన్ జో రూట్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు సృష్టించిన రూట్

చెన్నై: ఇంగ్లండ్ జట్టు టెస్ట్ కెప్టెన్ జో రూట్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన రూట్.. ఆడుతున్న వందో టెస్టులో ద్విశతకం సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎవరూ సాధించని ఘనత సాధించాడు. అంతేకాదు, సిక్సర్‌తో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గానూ రూట్ రికార్డుల్లోకి ఎక్కాడు.  


218 పరుగులు చేసిన రూట్.. నదీమ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రూట్‌కుతోడు డొమినిక్ సిబ్లీ (87), బెన్‌స్టోక్స్ (82) చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. 

Updated Date - 2021-02-06T21:36:40+05:30 IST