రైనోల సంరక్షణ కోసం రోహిత్ ఇలా..
ABN , First Publish Date - 2021-04-11T09:04:08+05:30 IST
ప్రమాదంలో పడిన ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నడుంబిగించాడు. అంతరించిపోతున్న ఆ ఖడ్గమృగాలను కాపాడేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...
చెన్నై: ప్రమాదంలో పడిన ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నడుంబిగించాడు. అంతరించిపోతున్న ఆ ఖడ్గమృగాలను కాపాడేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో రోహిత్.. ‘రైనోలను రక్షిద్దాం’ అని రాసి ఉన్న ప్రత్యేక బూట్లు ధరించాడు. ‘శుక్రవారంనాటి మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఓ మహత్తర కార్యక్రమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది’ అని రోహిత్ శనివారం ట్వీట్ చేశాడు.