న్యూజిలాండ్‌తో చివరి టీ20.. టాస్ గెలిచిన భారత్

ABN , First Publish Date - 2021-11-22T00:13:02+05:30 IST

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న చివరి టీ20లో టీమిండియా

న్యూజిలాండ్‌తో చివరి టీ20.. టాస్ గెలిచిన భారత్

కోల్‌కతా: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న చివరి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.


కివీస్ మాత్రం నేటి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కేఎల్ రాహుల్, అశ్విన్‌కు విశ్రాంతి ఇచ్చి ఇషాన్, చాహల్‌కు జట్టులో చోటిచ్చారు. ఈ మ్యాచ్‌లో సౌథీ ఆడడం లేదని కివీస్ కెప్టెన్ శాంట్నర్ తెలిపాడు.

Updated Date - 2021-11-22T00:13:02+05:30 IST