Rohit Sharma: నేను తిట్టుకున్న బ్యాట్‌తోనే తొలి అర్ధశతకం చేశాడు: దినేష్ కార్తీక్
ABN , First Publish Date - 2021-06-02T02:53:38+05:30 IST
తనకు కలిసి రాదని తిట్టుకున్న బ్యాట్‌తోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి అర్ధశతకం సాధించాడని టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ తెలిపాడు.
తనకు కలిసి రాదని తిట్టుకున్న బ్యాట్‌తోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి అర్ధశతకం సాధించాడని టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ తెలిపాడు. ఈ రోజు (మంగళవారం) 36వ బర్త్ డే చేసుకున్న కార్తీక్.. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అద్భుత అర్ధశతకం సాధించి జట్టుకు విజయం అందించాడు.
ఆ మ్యాచ్ గురించి తాజాగా కార్తీక్ మాట్లాడాడు. `నా బ్యాట్‌తోనే రోహిత్ తన తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని అందుకున్నాడు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే అవుటయ్యాను. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి నా బ్యాట్‌ను తిట్టుకున్నాను. ఈ బ్యాట్ నాకు కలిసిరావడం లేదని రోహిత్‌తో చెప్పాను. `ఈ బ్యాట్ బాగాలేదా? నాకు ఒకసారి ఇవ్వు` అంటూ ఆ బ్యాట్ తీసుకుని రోహిత్ బ్యాటింగ్‌కు వెళ్లాడు. ఆ బ్యాట్‌తోనే అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ ఘనత నా బ్యాట్‌ది కాదు. కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌దే. కాకపోతే అలాంటివి తలచుకుంటే చాలా బాగుంటుంద`ని చెప్పాడు.