రోహిత్ కూతురి మినీ పుల్ షాట్!
ABN , First Publish Date - 2021-03-31T17:37:31+05:30 IST
ఐపీఎల్ సమరానికి త్వరలోనే తెర లేవబోతోంది. ఏప్రిల్ 9వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది.
ఐపీఎల్ సమరానికి త్వరలోనే తెర లేవబోతోంది. ఏప్రిల్ 9వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడబోతున్నాయి. రోహిత్ సారథ్యంలోని ముంబై జట్టు మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తన కుటుంబంతో కలిసి రోహిత్ సోమవారం ముంబై టీమ్‌తో జాయిన్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో ముంబై టీమ్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ కూతురు సమైరా హెల్మెట్ పెట్టుకుని సందడి చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. తన తండ్రి బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ సమైరా పుల్ షాట్ ఫోజులిచ్చింది. `డాడీ పుల్ షాట్ ఎలా కొడతార`ని రితిక (రోహిత్ భార్య) అడగ్గా.. సమైరా ఆడి చూపించింది. ఈ వీడియో ముంబై అభిమానులను ఆకట్టుకుంటోంది.