‘ఇండియా బుక్‌’ రికార్డ్స్‌లో ఖ్యాతి

ABN , First Publish Date - 2021-06-22T05:52:59+05:30 IST

యువ ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటర్‌, తెలుగమ్మాయి అనుపోజు ఖ్యాతి ఇండియా బుక్‌

‘ఇండియా బుక్‌’ రికార్డ్స్‌లో ఖ్యాతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): యువ ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటర్‌, తెలుగమ్మాయి అనుపోజు ఖ్యాతి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించింది. హైదరాబాద్‌కు చెందిన ఖ్యాతి రోలర్‌ స్కేటింగ్‌లో ఇప్పటి వరకు 71 మెడల్స్‌ సాధించింది. ఇందులో ఒక అంతర్జాతీయ, 9 జాతీయ, 28 రాష్ట్ర స్థాయి పతకాలున్నాయి. 15 ఏళ్ల ఖ్యాతి దక్షిణ కొరియా (2019)లో జరిగిన ఆసియా రోలర్‌ స్కేటింగ్‌లో రజతం గెలిచి సత్తా చాటింది. పిన్న వయస్సులోనే ఇన్ని ఘనతలు సాధించడంతో ఇండియా బుక్స్‌ ఆఫ్‌ రికార్డ్సులో ఖ్యాతికి స్థానం లభించింది.

Updated Date - 2021-06-22T05:52:59+05:30 IST