వింబుల్డన్‌ 2021లో రవిశాస్త్రి

ABN , First Publish Date - 2021-07-12T09:30:22+05:30 IST

టీమిండియా కోచ్ రవిశాస్త్రి వింబుల్డన్ 2021లో సందడి చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వింబుల్డన్ స్టేడియంలో..

వింబుల్డన్‌ 2021లో రవిశాస్త్రి

టీమిండియా కోచ్ రవిశాస్త్రి వింబుల్డన్ 2021లో సందడి చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వింబుల్డన్ స్టేడియంలో కూర్చున్న తన సెల్పీని షేర్ చేసిన రవిశాస్త్రి.. ‘నమ్మలేని అనుభూతి’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు, కోచ్ రవిశాస్త్రి 20 రోజుల బ్రేక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో వచ్చే నెల 4వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వీరంతా ఈ బ్రేక్ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రవిశాస్త్రి వింబుల్డన్ 2021 టోర్నీ చూడడానికి హాజరయ్యారు.


ఇదిలా ఉంటే విబుల్డన్ 2021 టైటిల్‌ను ముందుగా ఊహించినట్లుగానే ప్రపంచ నెంబర్ వన్ నోవాక్ జకోవిక్ కైవసం చేసుకున్నాడు. వరల్డ్ నెంబర్ నైన్ ఆటగాడు బెర్రెట్టీని వరుస సెట్లలో మట్టి కరిపించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో జకో కెరీర్లో 6వ వింబుల్డన్ టైటిల్‌ను దక్కంచుకోవడమే కాకుండా కెరీర్లో 20వ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను నెగ్గి రికార్డు నెలకొల్పాడు. ఫెదరర్, నాదల్ సరసన చేరాడు. 



Updated Date - 2021-07-12T09:30:22+05:30 IST