రాహుల్‌+సచిన్‌ = రచిన్‌

ABN , First Publish Date - 2021-11-26T10:17:41+05:30 IST

రాహుల్‌+సచిన్‌ = రచిన్‌

రాహుల్‌+సచిన్‌ = రచిన్‌

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ రచిన్‌ రవీంద్ర.. తన తండ్రి పుట్టిన గడ్డపై టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయడం విశేషం. అయితే, అంతకంటే విశేషం అతడి పేరులోనే దాగి ఉంది. బెంగళూరుకు చెందిన రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తికి.. టీమిండియా దిగ్గజాలు రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌ అంటే ఎంతో అభిమానం. అందుకే వారి పేర్లు కలసి వచ్చేలా తన కుమారుడికి రాహుల్‌లో ‘ర’, సచిన్‌లో ‘చిన్‌’ కలిపి ‘రచిన్‌’ అని పేరుపెట్టాడు. అతడు పుట్టకముందే 1990ల్లో కృష్ణమూర్తి కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకొనే ప్రదర్శన చేసిన 22 ఏళ్ల రచిన్‌.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్స్‌లో భారత్‌తో తలపడిన కివీస్‌ జట్టులో రవీంద్ర సభ్యుడు. గతంలో దీపక్‌ పటేల్‌, జీతన్‌ పటేల్‌, ఇష్‌ సోధీ, జీత్‌ రావల్‌, ఎజాజ్‌ పటేల్‌, రోనీ హీరా లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు కివీ్‌సకు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు రచిన్‌ కూడా వారి సరసన చేరాడు.  

Updated Date - 2021-11-26T10:17:41+05:30 IST