థామస్‌ కప్‌ క్వార్టర్స్‌లో భారత్‌

ABN , First Publish Date - 2021-10-14T09:11:25+05:30 IST

భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. గ్రూప్‌-సిలో భాగంగా తహితి జట్టుతో పోరులో భారత్‌ 5-0తో గెలిచింది.

థామస్‌ కప్‌ క్వార్టర్స్‌లో భారత్‌

ఆర్హస్‌ (డెన్మార్క్‌): భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. గ్రూప్‌-సిలో భాగంగా తహితి జట్టుతో పోరులో భారత్‌ 5-0తో గెలిచింది. సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జ్‌, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ, కృష్ణ ప్రసాద్‌-విష్ణు జంట ప్రత్యర్థులను ఓడించి భారత్‌కు పూర్తి ఆధిక్యాన్ని అందించారు. ఇక బుధవారం జరిగే తమ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో చైనాతో భారత్‌ తలపడనుంది. కాగా, ఉబెర్‌కప్‌లో భారత మహిళల జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో 0-5తో థాయ్‌లాండ్‌ చేతిలో ఓడింది. అయితే, అమ్మాయిలు ఇప్పటికే క్వార్టర్స్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2021-10-14T09:11:25+05:30 IST