సింధు అవుట్
ABN , First Publish Date - 2021-11-28T08:41:55+05:30 IST
ఇండోనేసియా ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు, సాత్విక్ జోడీల జోరుకు బ్రేక్ పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ్‌సలో సింధు..

సాత్విక్ జోడీ కూడా
బాలి: ఇండోనేసియా ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు, సాత్విక్ జోడీల జోరుకు బ్రేక్ పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు 21-15, 9-21, 14-21తో రచనోక్ ఇంటానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. కాగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి ద్వయం 16-21, 18-21తో ఇండోనేసియా జోడీ మార్కస్-కెవిన్ సంజయ సుకముల్జో చేతిలో ఓడింది. దీంతో టోర్నీలో భారత పోరాటం ముగిసింది.