బ్యాడ్మింటన్ ఛాంపియన్ PV Sindhu లవ్ పాటకు డాన్స్...వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-11-09T17:18:34+05:30 IST

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఒలింపియన్ పీవీ సింధూ లెహంగా ధరించి లవ్ పాటకు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

బ్యాడ్మింటన్ ఛాంపియన్ PV Sindhu లవ్ పాటకు డాన్స్...వీడియో వైరల్

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఒలింపియన్ పీవీ సింధూ లెహంగా ధరించి లవ్ పాటకు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం సింధూ భాతరదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు పొందింది.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా తదితరుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సింధును పద్మభూషణ్‌తో సత్కరించారు. పద్మభూషణ్ అవార్డు పొందిన సింధూ ఆకుపచ్చ రంగు లెహంగా ధరించి ‘లవ్’ అనే వైరల్ పాటకు నృత్యం చేసింది. సింధూ డాన్స్ చేసిన తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. 


ఆదివారం అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు 4 లక్షలకు పైగా లైక్‌లు  2,500 కంటే ఎక్కువ వ్యాఖ్యలు వచ్చాయి. సింధూ టోక్యోలో జరిగిన కాంస్య పతక పోరులో చైనాకు చెందిన హీ బింగ్ జియావోను ఓడించి రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది.‘‘ గౌరవనీయులైన మా రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ సార్ నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకోవడం నాకు నిజంగా అందిన ఆశీర్వాదం. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం కోసం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సింధూ పోస్టు పెట్టారు. 


Updated Date - 2021-11-09T17:18:34+05:30 IST