మిల్కాసింగ్‌కు పాజిటివ్
ABN , First Publish Date - 2021-05-21T05:40:18+05:30 IST
దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా బారినపడ్డాడు. దాంతో 91 ఏళ్ల ఈ స్ర్పింటర్ చండీగఢ్‌లోని ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు.

హోమ్ ఐసోలేషన్ దిగ్గజ స్ర్పింటర్
చండీగఢ్: దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా బారినపడ్డాడు. దాంతో 91 ఏళ్ల ఈ స్ర్పింటర్ చండీగఢ్‌లోని ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడి సహాయకులు కొందరికి కొవిడ్ సోకడంతో మిల్కాసింగ్ కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఫ్లయింగ్ సిఖ్ పాజిటివ్‌గా తేలాడు. ‘నేను బాగానే ఉన్నా. దగ్గు, జ్వరం లేవు. నాలుగో రోజుల్లో కోలుకుంటానని డాక్టర్ చెప్పారు. నిన్న జాగింగ్ చేశా. ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ అని మిల్కా వివరించాడు.