టీమిండియా విజయం.. స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2021-02-01T07:02:28+05:30 IST

స్ఫూర్తిదాయక పోరాటంతో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన టీమిండియాను ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఈ నెలలో క్రికెట్‌ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆరంభంలో ఒడిదుడుకులు ఎదురైనా..

టీమిండియా విజయం.. స్ఫూర్తిదాయకం

  • ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని


న్యూఢిల్లీ: స్ఫూర్తిదాయక పోరాటంతో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన టీమిండియాను ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఈ నెలలో క్రికెట్‌ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆరంభంలో ఒడిదుడుకులు ఎదురైనా.. భారత జట్టు అద్భుతంగా పుంజుకొంది. ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ కైవసం చేసుకొంది. మన జట్టు సమష్టి కృషి, పోరాటం స్ఫూర్తిదాయకమ’ని ఆదివారం ప్రసారమైన కార్యక్రమంలో మోదీ అన్నారు. ఇందుకు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. ‘ప్రేరణ ఇచ్చే మాటలకు, ప్రశంసలకు ధన్యవాదాలు. మువ్వన్నెలను రెపరెపలాడించడానికి టీమిండియా పోరాడుతుంద’ని ట్వీట్‌ చేసింది. ప్రధాని ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేసిన కోహ్లీ.. జాతీయ పతాకాన్ని పోస్టు చేశాడు. అలాగే కోచ్‌ రవిశాస్ర్తి ‘ప్రధానికి ధన్యవాదాలు. మీ మాటలు జట్టుకు మరింత ప్రేరణనిస్తున్నాయి. భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లోనూ ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకొని విజయాలు సాధించాలనే సంకల్ప బలాన్ని పెంచుతున్నాయ’ని ట్వీట్‌ చేశాడు. భారత జట్టు విజయాన్ని ప్రశంసించిన మోదీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా ధన్యవాదాలు తెలిపాడు. ‘భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ మాటలు స్ఫూర్తి మంత్రాల’ని బోర్డు కార్యదర్శి  జై షా ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-02-01T07:02:28+05:30 IST