కొలంబియాపై పెరూ గెలుపు

ABN , First Publish Date - 2021-06-22T05:54:01+05:30 IST

కోపా అమెరికా కప్‌లో పెరూ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం గ్రూప్‌-బిలో జరిగిన

కొలంబియాపై పెరూ గెలుపు

 కోపా అమెరికా 


సావో పౌలో: కోపా అమెరికా కప్‌లో పెరూ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం గ్రూప్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో పెరూ 2-1తో కొలంబియాపై నెగ్గి నాకౌట్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 17వ నిమిషంలో సెర్గియో పెనా గోల్‌తో పెరూ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, సెకండా్‌ఫలో లభించిన పెనాల్టీని కొలంబియా ఆటగాడు మిగ్యుయెల్‌ బోర్జా (53వ) గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. కానీ, 11 నిమిషాల తర్వాత కొలంబియా డిఫెండర్‌ ఎరి మినా సెల్ఫ్‌ గోల్‌తో పెరూ గెలిచింది. ఇదే గ్రూప్‌లో వెనిజులా, ఈక్వెడార్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. 


Updated Date - 2021-06-22T05:54:01+05:30 IST