ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. సరికొత్త రికార్డ్!

ABN , First Publish Date - 2021-11-26T21:45:53+05:30 IST

ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఆ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్..

ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. సరికొత్త రికార్డ్!

సిడ్నీ: ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఆ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ‘సెక్స్టింగ్’ ఆరోపణల నేపథ్యంలో గత వారం టిమ్ పైన్ టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పలు వడపోతలు, ఇంటర్వ్యూ తరువాత కమిన్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది. స్టీవ్ స్మిత్‌ను వైఎస్ కెప్టెన్‌గా నియమించింది.


ఆస్ట్రేలియా జట్టు 47వ టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్ మరో ఘనత కూడా సాధించాడు. ఆసీస్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికైన తొలి పేసర్‌గా రికార్డులకెక్కాడు. టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన ‘ఊహించని’ గౌరవమని పేర్కొన్నాడు.


యాసెస్ సిరీస్‌కు ముందు తనకు దక్కిన ఈ గౌరవాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పాడు. గతంలో పైన్ జట్టును ఎలా అయితే నడిపించాడో తాను కూడా అలానే జట్టును నడిపించేందుకు కృషి చేస్తానన్నాడు.     


Updated Date - 2021-11-26T21:45:53+05:30 IST