కొవిడ్‌ బాధితులకు పాండ్యా బ్రదర్స్‌ చేయూత

ABN , First Publish Date - 2021-05-02T09:39:12+05:30 IST

కరోనా బాధితులను ఆదుకోవడానికి క్రికెట్‌ సోదరులు హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యా ముందుకు వచ్చారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం తాము 200

కొవిడ్‌ బాధితులకు పాండ్యా బ్రదర్స్‌ చేయూత

న్యూఢిల్లీ: కరోనా బాధితులను ఆదుకోవడానికి క్రికెట్‌ సోదరులు హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యా ముందుకు వచ్చారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం తాము 200 ఆక్సిజన్‌ కాన్సంట్రెటర్స్‌ అందిస్తున్నట్టు హార్దిక్‌ శనివారం ప్రకటించాడు. ‘మిషన్‌ వాయు’ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె కూడా 30 ఆక్సిజన్‌ కాన్సంట్రెటర్స్‌ దానం చేశాడు. విద్యుత్‌తో పని చేసే ఈ పరికరం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొవిడ్‌ రెండో దశతో దేశంలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-02T09:39:12+05:30 IST