అర్ధశతకం అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న క్రునాల్!

ABN , First Publish Date - 2021-03-24T16:05:18+05:30 IST

అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత అర్ధశతకం సాధించి సత్తా చాటాడు ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా.

అర్ధశతకం అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న క్రునాల్!

అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత అర్ధశతకం సాధించి సత్తా చాటాడు ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌తో క్రునాల్ వన్డే అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి అరంగేట్ర వన్డేలోనే అత్యంత వేగంగా అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌‌గా నిలిచాడు. 


కేఎల్ రాహుల్‌తో కలిసి  57 బంతుల్లోనే 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్రునాల్ హాఫ్ సెంచరీ చేయగానే పెవిలియన్‌లో ఉన్న సోదరుడు హార్దిక్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సోదరుడు హార్దిక్‌ను కౌగిలించుకుని క్రునాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల మరణించిన తండ్రికి తన ఇన్నింగ్స్‌ను అంకితమిచ్చాడు. Updated Date - 2021-03-24T16:05:18+05:30 IST