ఒలింపిక్స్‌ రద్దు ?

ABN , First Publish Date - 2021-01-23T09:25:22+05:30 IST

కరోనాతో ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ అసలు జరిగే అవకాశమే లేదని లండన్‌కు చెందిన ది టైమ్స్‌ పత్రిక ప్రచురించిన

ఒలింపిక్స్‌ రద్దు ?

  • ‘టైమ్స్‌’ కథనం

          నిర్వహిస్తామని జపాన్‌ స్పష్టీకరణ

టోక్యో: కరోనాతో ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ అసలు జరిగే అవకాశమే లేదని లండన్‌కు చెందిన ది టైమ్స్‌ పత్రిక ప్రచురించిన కథనం అంతర్జాతీయ క్రీడా రంగంలో కలకలం రేపింది. ఈ జూలై 23 నుంచి ఆగస్టు ఎనిమిది వరకు జరగాల్సిన టోక్యో విశ్వ క్రీడలు రద్దు చేయక తప్పదన్న జపాన్‌ ప్రభుత్వంలోని మంత్రి ఒకరిని ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది. అయితే ఈ కథనాన్ని ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ తోసిపుచ్చారు. నిర్ణీత సమయంలోనే ఒలింపిక్స్‌ జరుగుతాయన్నారు. మరోవైపు.. జపాన్‌ ప్రభుత్వం కూడా ఆ కథనాన్ని ఖండించింది.

Updated Date - 2021-01-23T09:25:22+05:30 IST