అతనిపై దృష్టి లేదు.. రెండో రోజు మా గోల్ అదేనన్న బుమ్రా!

ABN , First Publish Date - 2021-02-06T11:03:31+05:30 IST

ఏడాదిపైగా గడిచిన తర్వాత మళ్లీ భారత దేశానికి క్రికెట్ తిరిగొచ్చింది. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించినట్లే కనబడుతోంది.

అతనిపై దృష్టి లేదు.. రెండో రోజు మా గోల్ అదేనన్న బుమ్రా!

చెన్నై: ఏడాదిపైగా గడిచిన తర్వాత మళ్లీ భారత దేశానికి క్రికెట్ తిరిగొచ్చింది. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించినట్లే కనబడుతోంది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్.. 263 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మీడియాతో మాట్లాడారు. ఇంగ్లండ్ ఇన్నింగ్సులో వాళ్ల కెప్టెన్ జో రూట్ అద్భుతంగా రాణించాడు. 197 బంతులు ఎదుర్కొన్న రూట్.. 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనిపై మాట్లాడిన బుమ్రా.. రెండో రోజు ఆటతో తమ టార్గెట్ రూట్ కాదని తేల్చిచెప్పాడు. ‘‘రూట్‌పై ఫోకస్ పెట్టడం లేదు. మా లక్ష్యం రెండో రోజు ఏడు వికెట్లు కూల్చడమే. ప్రతి వికెట్ విలువా మాకు సమానమే’’ అని వెల్లడించాడు. మరి రెండో రోజు ఆటలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి.

Updated Date - 2021-02-06T11:03:31+05:30 IST