వన్డేల్లో ఓపెనింగ్ వాళ్లిద్దరే.. మార్పుల్లేవన్న కోహ్లీ

ABN , First Publish Date - 2021-03-23T05:19:06+05:30 IST

ఇంగ్లండ్‌తో టెస్టు, టీ20 సిరీసులు గెలిచిన ఊపులో ఉన్న కోహ్లీ సేన వన్డే సిరీసును కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తమ దగ్గరున్న ఉత్తమ అస్త్రాలను సిద్ధం చేస్తోంది.

వన్డేల్లో ఓపెనింగ్ వాళ్లిద్దరే.. మార్పుల్లేవన్న కోహ్లీ

పూణే: ఇంగ్లండ్‌తో టెస్టు, టీ20 సిరీసులు గెలిచిన ఊపులో ఉన్న కోహ్లీ సేన వన్డే సిరీసును కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తమ దగ్గరున్న ఉత్తమ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు జోడీగా కెప్టెన్ కోహ్లీ ఓపెనింగ్ చేసి అదరగొట్టాడు. దీంతో వన్డేల్లో కూడా ఈ జోడీ ఇలానే చేసే అవకాశం ఉందని వదంతులు వచ్చాయి. వీటికి కెప్టెన్ కోహ్లీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. వన్డేల్లో రోహిత్, ధవన్ కలిసి ఓపెనింగ్ చేస్తారని తేల్చిచెప్పేశాడు. ‘‘వన్డేల విషయంలో అసలు ఎలాంటి అనుమానమూ లేదు. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈ జోడీ అద్భుతంగా రాణిస్తోంది’’ అని కోహ్లీ అన్నాడు. మంగళవారం నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీసులో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు రోహిత్, ధవన్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు.

Updated Date - 2021-03-23T05:19:06+05:30 IST