New Zealand మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
ABN , First Publish Date - 2021-12-30T12:49:43+05:30 IST
న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారు....

జింబాబ్వే: న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారు.స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి టేలర్ టెస్టుల నుంచి రిటైర్ అవుతారు.ఈ విషయాన్ని డిసెంబర్ 30న రాస్ టేలర్ ట్విట్టర్లో ప్రకటించారు.‘‘ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను,నా 17 సంవత్సరాల అద్భుతమైన ఇన్నింగ్స్‌కు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు.’’అని టేలర్ పేర్కొన్నారు.రాస్ 2006వ సంవత్సరంలో వెస్టిండీస్‌తో మెక్లీన్ పార్క్‌లో జరిగిన ఒడీఐలో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 233 ఒడీఐల్లో 48.18 సగటుతో 21 సెంచరీలతో సహా 8,576 పరుగులు చేశారు.టేలర్ మరో రెండు టెస్టులు ఆడనున్నారు. అంటే అతను 112 టెస్టుల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రిటైర్ అవుతారు.టేలర్ అత్యుత్తమంగా 290 పరుగులు చేశారు.