హైదరాబాద్‌లో నెహ్రూ జాతీయ హాకీ టోర్నీ

ABN , First Publish Date - 2021-08-20T09:17:06+05:30 IST

జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ హాకీ టోర్నమెంట్‌కు హైదరాబాద్‌ తొలిసారిగా వేదిక అవుతోంది. జేఎన్‌హెచ్‌టీ సొసైటీ ఆధ్వర్యంలో 1964 నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ ద్వారా ...

హైదరాబాద్‌లో నెహ్రూ జాతీయ హాకీ టోర్నీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ హాకీ టోర్నమెంట్‌కు హైదరాబాద్‌ తొలిసారిగా వేదిక అవుతోంది.  జేఎన్‌హెచ్‌టీ సొసైటీ ఆధ్వర్యంలో 1964 నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ ద్వారా ధనరాజ్‌ పిళ్లే, పర్గత్‌ సింగ్‌, జాఫర్‌ ఇక్బాల్‌, అజిత్‌పాల్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ వంటి మేటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా గురువారం నగరంలోని ఒక హోటల్‌లో జేఎన్‌హెచ్‌టీ సొసైటీ కార్యదర్శి కుకూ వాలియా ట్రోఫీని ఆవిష్కరించారు. భారత రైల్వేస్‌, దక్షిణ మధ్య రైల్వే, వైమానిక దళం, నేవీ, ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్జీసీ, ఆర్మీ, తెలంగాణ, తమిళనాడు, ముంబై, భోపాల్‌, మధ్యప్రదేశ్‌ ఎలెవన్‌తో పాటు మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే హాకీ గ్రౌండ్స్‌లో నవంబరు 14 నుంచి 25 వరకు పోటీలు జరగనున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.10 లక్షలు, విజేతకు రూ.4 లక్షలు, రన్నర్‌పకు రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. మిగిలినవి ఆ తర్వాతి స్థానాల్లోని జట్లకు అందజేస్తారు.


Updated Date - 2021-08-20T09:17:06+05:30 IST