వామ్మో.. చోప్రాతో రూమా!

ABN , First Publish Date - 2021-08-10T08:57:25+05:30 IST

ఒలింపిక్స్‌ స్వర్ణ పతకంతో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా దేశ హీరోగా మారిపోయాడు.

వామ్మో.. చోప్రాతో రూమా!

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ స్వర్ణ పతకంతో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా దేశ హీరోగా మారిపోయాడు. బెంగళూరులోని జాతీయ శిబిరంలో నీరజ్‌ రూమ్మేట్‌గా ఉన్న హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌ ‘గోల్డెన్‌ బాయ్‌’ గురించిన సంగతులు పంచుకున్నాడు. కేవలం రెండు వారాలకే చోప్రాతో ఒకే గదిలో ఉండాలంటే భయపడ్డానని అతడు వెల్లడించాడు.


కారణం..నీరజ్‌ పద్దతి ప్రకారం ఉండకపోవడమేనట. ‘ఒక గదిలో 15 రోజులు పాటు ఇద్దరం ఉన్నాం. అతడు ఒలింపిక్‌ చాంపియనే కావొచ్చు. కానీ నీరజ్‌తో కలిసి గదిలో ఉండాలంటే భయపడ్డా. అతడు ఓ పద్దతి ప్రకారం ఉండడు. చోప్రా దుస్తులు బెడ్‌పై ఉంటాయి. సాక్సులు గది మధ్యలో కనిపిస్తాయి. అయినా అతడిని ఏమీ అనేవాడిని కాదు. ఎందుకంటే నీరజ్‌ రూమ్మేట్‌గా ఉండడం నాకు గొప్ప విషయం’ అని ఢిల్లీకి చెందిన హైజంపర్‌ శంకర్‌ వివరించాడు. శనివారంనాడు అతడు స్వర్ణ పతకం సాధించడంతో తాను ఉబ్బితబ్బిబ్బయ్యానని చెప్పాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే తన లక్ష్యమని అప్పుడే నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. 

Updated Date - 2021-08-10T08:57:25+05:30 IST