హైదరాబాద్ కథ ముగిసె
ABN , First Publish Date - 2021-11-21T08:42:04+05:30 IST
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. శనివారం జరిగిన తొలి సెమీ్‌సలో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంప్ తమిళనాడు చేతిలో చిత్తయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన

ముస్తాక్ అలీ ఫైనల్లో తమిళనాడు, కర్ణాటక
న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. శనివారం జరిగిన తొలి సెమీ్‌సలో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంప్ తమిళనాడు చేతిలో చిత్తయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. పేసర్ శ్రవణ్ కుమార్ (5/21) దెబ్బకు 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్ (25) టాప్ స్కోరర్. ఛేదనలో తమిళనాడు.. కెప్టెన్ విజయ్ శంకర్ (43 నాటౌట్), సుదర్శన్ (34 నాటౌట్) రాణించడంతో 14.2 ఓవర్లలో 92/2 స్కోరు చేసి నెగ్గింది. రక్షణ్ రెడ్డి (2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. మరో సెమీ్‌సలో కర్ణాటక 4 పరుగుల తేడాతో విదర్భపై నెగ్గి ఫైనల్ చేరింది. ఓపెనర్ రోహన్ కదమ్ (87), కెప్టెన్ మనీష్ పాండే (54) అర్ధ శతకాలతో చెలరేగడంతో.. కర్ణాటక 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 రన్స్ చేసింది. దర్శన్ (4/28) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో విదర్భ ఓవర్లన్నీ ఆడి 172/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. సోమవారం ఫైనల్ జరగనుంది.