25వ సారి ఎవరెస్ట్ అధిరోహించి..
ABN , First Publish Date - 2021-05-08T09:13:43+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరె్‌స్టను అధిరోహించడమంటే అతనికి వెన్నతో పెట్టిన విద్య కాబోలు.

ఖట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరె్‌స్టను అధిరోహించడమంటే అతనికి వెన్నతో పెట్టిన విద్య కాబోలు. అందుకేనేమో.. అత్యధికసార్లు ఎవరెస్ట్ ఎక్కి అరుదైన రికార్డు నెలకొల్పాడు. నేపాల్‌కు చెందిన 52 ఏళ్ల కమి రిటా షెర్పా రికార్డుస్థాయిలో 25వ సారి ఎవరె్‌స్టను అధిగమించి తనకు తిరుగులేదని నిరూపించాడు. మరో 11 మందితో కలిసి అతను శుక్రవారం ఎవరె్‌స్టను చేరుకొని ఈ ఘనత సాధించాడు.