ఆ ముగ్గురు పేసర్లలో షమీ ఒకడు: కోహ్లీ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-12-31T00:56:10+05:30 IST
టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు..

సెంచూరియన్: టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో షమీ ఒకడని పొగడ్తలు కురిపించాడు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నేల కూల్చాడు. ఈ టెస్టులో విజయం సాధించిన కోహ్లీ సేన 1-0తో ఆధిక్యం సాధించింది.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. తన వరకు చెప్పాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ ముగ్గురు సీమర్లలో షమీ ఒకడని ప్రశంసించాడు. కచ్చితంగా అతడు ప్రపంచస్థాయి ఆటగాడని పేర్కొన్నాడు. ఇతరులకు పెద్దగా సహకరించని పిచ్‌లపై అతడు బౌలింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంటుందన్నాడు. ఎలాంటి పిచ్ నుంచి అయినా అతడు వికెట్లు రాబట్టగలుగుతాడని కొనియాడాడు. అత్యద్భుత ప్రదర్శనతో 200 వికెట్ల క్లబ్‌లోకి చేరినందుకు సంతోషంగా ఉందని కోహ్లీ పేర్కొన్నాడు.