టీమిండియాకు ఆ రెండు జట్లే పోటీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ABN , First Publish Date - 2021-03-22T18:33:33+05:30 IST

ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ-20 ప్రపంచకప్‌లో విజయావకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియాకు ఆ రెండు జట్లే పోటీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ-20 ప్రపంచకప్‌లో విజయావకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో ఆడుతుండడం, నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవ లేకపోవడం టీమిండియాకు సానుకూల అంశాలని అథర్టన్ చెప్పాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో అథర్టన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 


`బుమ్రా, షమీ, జడేజా వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే భారత జట్టు తాజాగా ఇంగ్లండ్ వంటి నెంబర్ వన్ జట్టును ఓడించింది. ఐపీఎల్ వల్ల టీమిండియా రిజర్వ్ బలం పెరిగింది. నైపుణ్యం గల యువ క్రికెటర్లు జట్టులోకి వస్తున్నారు. అన్నింటి కంటే మించి స్వదేశంలో ఆడుతుండడం టీమిండియాకు పెద్ద సానుకూలాంశం. రాబోయే ప్రపంచకప్‌లో టీమిండియాకే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే వెస్టిండీస్, ఇంగ్లండ్ వంటి జట్లు టీ-20 క్రికెట్లో అత్యంత ప్రమాదరకమైనవి. వాటిని ఓడించగలిగితే టీమిండియాకు తిరుగు లేద`ని అథర్టన్ అన్నాడు. 

Updated Date - 2021-03-22T18:33:33+05:30 IST