మీరట్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ధ్యాన్ చంద్ పేరు

ABN , First Publish Date - 2021-08-20T07:03:22+05:30 IST

జాతీయ స్థాయి క్రీడల్లో ఉన్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం పేరును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ధ్యాన్ చంద్ అవార్డుగా..

మీరట్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ధ్యాన్ చంద్ పేరు

లక్నో: జాతీయ స్థాయి క్రీడల్లో ఉన్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం పేరును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ధ్యాన్ చంద్ అవార్డుగా మార్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ క్రీడా యూనివర్సిటీకి కూడా ధ్యాన్ చంద్ పేరును పెట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఇకపై మీరట్‌ స్పోర్స్ యూనివర్సిటీ ఇకపై ధ్యాన్ చంద్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందనుందని గురువారం వెల్లడించారు. భారత క్రీడా చరిత్రలో మేజర్ ధ్యాన్ చంద్ పాత్ర ఎంతో ఉందని, అందుకే ఆయన పేరును ఈ యూనివర్సిటీకి పెట్టి గౌరవిస్తున్నామని సీఎం యోగి తెలిపారు.

Updated Date - 2021-08-20T07:03:22+05:30 IST