టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్ చేయకపోవచ్చు: కోహ్లీ

ABN , First Publish Date - 2021-03-23T04:47:55+05:30 IST

టీమిండియా ఓపెనర్‌గా కెప్టెన్ కోహ్లీ వన్డే సిరీస్‌లో కొనసాగే అవకాశం లేదని రోహిత్ చెప్పిన మాటలను కోహ్లీ సమర్థించాడు. వన్డేల్లో తాను ఓపెనింగ్‌కు రావడం లేదని, దానికి రోహిత్, ధవన్ ఉన్నారని..

టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్ చేయకపోవచ్చు: కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఓపెనర్‌గా కెప్టెన్ కోహ్లీ వన్డే సిరీస్‌లో కొనసాగే అవకాశం లేదని రోహిత్ చెప్పిన మాటలను కోహ్లీ సమర్థించాడు. వన్డేల్లో తాను ఓపెనింగ్‌కు రావడం లేదని, దానికి రోహిత్, ధవన్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. వన్డేల్లో రోహిత్‌-ధవన్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యంపై తమకెలాంటి సందేహాలు లేవని, అందువల్ల వారినే ఓపెనింగ్ జట్టుగా కొనసాగించాలని తాము అనుకుంటున్నామని స్పష్టం చేశాడు. కాగా.. టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో తాను ఓపెనింగ్ చేయడంపై మాట్లాడుతూ.. సూర్యకుమార్‌కు అవకాశం ఇచ్చేందుకే తాను ఓపెనింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అలాగే ఈ ఏడాది టీ20 ప్రపంపచకప్‌ జరగనున్న నేపథ్యంలో అన్ని రకాల ప్రయోగాలూ చేస్తున్నామని, పూర్తి సక్సెస్ ఫార్ములాతో బరిలోకి దిగాలనేదే తమ ఆలోచనని కోహ్లీ చెప్పాడు. అయితే అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో ఓపెనింగ్ చేసే ఆలోచన ప్రస్తుతానికైతే తనకు లేదని, అందువల్ల రెగ్యులర్ ఓపెనర్లే ఆడే అవకాశం ఉందని కోహ్లీ వివరించాడు. కాగా.. మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ పుణేలో ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా కసిగా ఉంటే.. ఇప్పటికే రెండు సిరీస్‌లలో ఘోర ఓటమి చవి చూసిన ఇంగ్లండ్ ఈ సిరీస్‌తో అయినా పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది.

Updated Date - 2021-03-23T04:47:55+05:30 IST