కోహ్ల్లీ నోరు తెరిస్తే బూతులే: కాంప్టన్‌

ABN , First Publish Date - 2021-08-20T09:27:59+05:30 IST

క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీని మించి ఎవరూ బూతులు మాట్లాడరని ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ నిక్‌ కాంప్టన్‌ ఆరోపించాడు. ‘2012లో అతడి తిట్లను జీవితంలో మర్చిపోలేను...

కోహ్ల్లీ నోరు తెరిస్తే బూతులే: కాంప్టన్‌

క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీని మించి ఎవరూ బూతులు మాట్లాడరని ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ నిక్‌ కాంప్టన్‌ ఆరోపించాడు. ‘2012లో అతడి తిట్లను జీవితంలో మర్చిపోలేను. అలాంటి ప్రవర్తనతో తనను తానే దిగజార్చుకున్నాడు. ఇతన్ని చూశాక సచిన్‌, విలియమ్సన్‌, రూట్‌ ఎంత హుందాగా ఉంటారో కదా అనిపించింది’ అని కాంప్టన్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ వివాదాస్పదంగా మారడంతో చివరకు తొలగించాడు. ఇక, కాంప్టన్‌ను భారత క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ఆడుకుంటున్నారు. అండర్సన్‌, బట్లర్‌ ప్రవర్తన నీకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు.


టెస్టులంటే ప్రాణమిస్తాడు: పీటర్సన్‌

టెస్టు ఫార్మాట్‌కు విరాట్‌ కోహ్లీ అమిత గౌరవమిస్తాడని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ తెలిపాడు. దిగ్గజాలు సచిన్‌, ద్రవిడ్‌ దారిలోనే అతడు నడుస్తున్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు గెలవాలనే కాంక్ష కలిగి ఉంటాడని కొనియాడాడు. లార్డ్స్‌ విజయంతో అతడి ఉత్సాహం, పట్టుదల ఎలాంటివో అందరికీ అర్థమయిందని చెప్పాడు.

Updated Date - 2021-08-20T09:27:59+05:30 IST