ధోనీ మొదలెడితే కోహ్లీ కొనసాగిస్తున్నాడు.. సిరీస్ సెలబ్రేషన్స్‌లో అదే సంప్రదాయం

ABN , First Publish Date - 2021-03-22T02:31:08+05:30 IST

కోహ్లీ మొదలు పెట్టిన సంప్రదాయాన్ని కోహ్లీ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ గెలిచిన తరువాత ట్రోఫీ అందుకున్న కోహ్లీ.. నేరుగా వచ్చి ఇషన్ కిషన్ చేతికిచ్చాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడికి ట్రోఫీ అందించడం..

ధోనీ మొదలెడితే కోహ్లీ కొనసాగిస్తున్నాడు.. సిరీస్ సెలబ్రేషన్స్‌లో అదే సంప్రదాయం

అహ్మదాబాద్: కోహ్లీ మొదలు పెట్టిన సంప్రదాయాన్ని కోహ్లీ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ గెలిచిన తరువాత ట్రోఫీ అందుకున్న కోహ్లీ.. నేరుగా వచ్చి ఇషన్ కిషన్ చేతికిచ్చాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడికి ట్రోఫీ అందించడం ఒకప్పుడు ధోనీ పాటించిన సంప్రదాయం. ఇప్పుడు కోహ్లీ కూడా అదే చేశాడు. జట్టులోకి కొత్తగా ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చినప్పటికీ.. స్కై వయసు 30 ఏళ్లు కావడం, ఇషాన్ వయసు 22 ఏళ్లే కావడంతో కోహ్లీ అతడికే ట్రోఫీ అందించాడు. స్కై కూడా పక్కనే ఉండడంతో ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం దీనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌న్ 3-2 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. తొలి టీ20లో , మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్, నాలుగో మ్యాచ్‌లలో టీమిండియా గెలిచింది. ఇరు జట్లూ 2-2తో సమానంగా నిలిచాయి. దీంతో శనివారం జరిగిన 5వ టీ20 ఇరు జట్లకూ కీలకమైంది.


ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. రోహిత్(64), కోహ్లీ(80నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా ఏకంగా 2 వికెట్లకు 224 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ పోరాడినా పేసర్ భువనేశ్వర్ కీలక వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.Updated Date - 2021-03-22T02:31:08+05:30 IST