ఈ విజయం చాలా గొప్పది: విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2021-03-24T17:19:41+05:30 IST

ఈ మధ్య కాలంలో టీమిండియా సాధించిన అన్ని విజయాల్లోకి ఇంగ్లండ్‌పై తాజా వన్డే గెలుపు చాలా గొప్పదని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

ఈ విజయం చాలా గొప్పది: విరాట్ కోహ్లీ

ఈ మధ్య కాలంలో టీమిండియా సాధించిన అన్ని విజయాల్లోకి ఇంగ్లండ్‌పై తాజా వన్డే గెలుపు చాలా గొప్పదని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. గెలుపుపై ఆశలు వదులుకున్న దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. ఆటలో అద్భుతంగా పుంజుకున్న తీరు చాలా గొప్పదని తాజాగా మీడియాతో మాట్లాడిన కోహ్లీ అన్నాడు. 


`ఈ ఆటలో మేం తిరిగి పుంజుకోవడం అద్భుతమే. ఈ మధ్య కాలంలో మాకు ఇదే గొప్ప విజయం. మరేదీ దీనికి సాటి రాదు. ఈ విజయం పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. తుది జట్టులో చోటు దొరకనపుడు కూడా శిఖర్ ధవన్ చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఎప్పుడూ నిరాశ చెందడు. అతడు చేసిన 98 పరుగులు స్కోరుబోర్డులో కనిపించిన అంకెల కంటే చాలా గొప్పవి. ఇక, రాహుల్‌పై నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. జట్టుకు అవసరమైనపుడు విలువైన పరుగులు చేశాడు. ప్రస్తుతం ప్రతి స్థానానికీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అందరూ చక్కగా రాణిస్తున్నార`ని కోహ్లీ అన్నాడు. 

Updated Date - 2021-03-24T17:19:41+05:30 IST