బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్.. బౌలర్లు ఏం చేస్తారో?

ABN , First Publish Date - 2021-11-01T02:42:00+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్‌ 2లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ వైఫల్యం మరోమారు

బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్.. బౌలర్లు ఏం చేస్తారో?

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్‌ 2లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ వైఫల్యం మరోమారు కొట్టొచ్చినట్టు కనిపించింది. న్యూజిలాండ్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసి బలమైన ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేనకు ఏ దశలోనూ కలిసి రాలేదు. 70 పరుగులకే ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9) వంటి కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆదుకుంటాడనుకున్న పంత్ (12) కూడా బ్యాటెత్తేశాడు. హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (26, నాటౌట్) చివర్లో కాసేపు క్రీజులో కుదురుకోవడంతో భారత్ ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2 వికెట్లు తీసుకోగా, సౌథీ, మిల్నేచెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-11-01T02:42:00+05:30 IST