Kanpur Test: శ్రేయస్ అయ్యర్ ఔట్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-11-26T16:25:27+05:30 IST

టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట కొనసాగుతుంది. 305 పరుగుల వద్ద ఏడో వికెట్‎ను భారత్ నష్టపోయింది. అరంగేట్రం టెస్టులోనే

Kanpur Test: శ్రేయస్ అయ్యర్ ఔట్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..

కాన్పూర్ టెస్ట్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట కొనసాగుతుంది. 305 పరుగుల వద్ద ఏడో వికెట్‎ను భారత్ నష్టపోయింది. అరంగేట్రం టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ శతకం చేసి మంచి ఫామ్‎లో ఉన్నాడు. అయితే..సౌథీ వేసిన 96.1 ఓవర్‎లో విల్‎కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. శ్రేయస్ (171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105) పరుగులు చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఉమేష్ యాదవ్, అశ్విన్ 21 క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-11-26T16:25:27+05:30 IST