Kanpur Test: Lunch break..టీమిండియా స్కోర్ ఎంతంటే..
ABN , First Publish Date - 2021-11-28T17:26:55+05:30 IST
న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నాల్గవ రోజు లంచ్ సమయానికి భారత్

కాన్పూర్: న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నాల్గవ రోజు లంచ్ సమయానికి భారత్ జట్టు ఐదు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లోపడింది. లంచ్ బ్రేక్ వరకు కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయస్ అయ్యర్ (18), రవిచంద్రన్ అశ్విన్ (20) క్రీజులో ఉన్నారు. అయ్యర్, అశ్విన్ కలిసి 74 బంతుల్లో 33 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. టీమిండియాకు ప్రస్తుతం 133 పరుగుల ఆధిక్యం ఉంది. టీమిండియా జట్టు తొలి టెస్టులో పరాజయం నుంచి బయటపడాలంటే నాల్గవరోజు మొత్తం బ్యాటింగ్ చేయాల్సివుంది.