ప్రపంచకప్‌ కోర్‌ గ్రూప్‌లో జ్యోతి సురేఖ

ABN , First Publish Date - 2021-02-01T06:46:42+05:30 IST

తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖకు ఆర్చరీ ప్రపంచకప్‌ కోర్‌గ్రూప్‌లో చోటు లభించింది. మేలో జరగనున్న వరల్డ్‌కప్‌ కోసం ఆదివారం న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో భారత ఆర్చరీ సంఘం ట్రయల్స్...

ప్రపంచకప్‌ కోర్‌ గ్రూప్‌లో జ్యోతి సురేఖ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖకు ఆర్చరీ ప్రపంచకప్‌ కోర్‌గ్రూప్‌లో చోటు లభించింది. మేలో జరగనున్న వరల్డ్‌కప్‌ కోసం ఆదివారం న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో భారత ఆర్చరీ సంఘం  ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో 32 మంది పురుషులు, 38 మంది మహిళా ఆర్చర్లు పోటీపడ్డారు. వీరిలో నుంచి 24 మందిని ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేఖ 2767/2880 స్కోరుతో టాప్‌-12లో అగ్రస్థానంలో నిలిచి శభాష్‌ అనిపించింది. సురేఖ ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్‌ బోర్డ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది.  

Updated Date - 2021-02-01T06:46:42+05:30 IST