ప్రీక్వార్టర్స్‌లో ఇటలీ

ABN , First Publish Date - 2021-06-21T10:59:25+05:30 IST

ఇటలీ హ్యాట్రిక్‌ విజయాలతో యూరో కప్‌ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇటలీ మొత్తం 9 పాయింట్లతో గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలిచింది.

ప్రీక్వార్టర్స్‌లో ఇటలీ

యూరో కప్‌ 

 రోమ్‌: ఇటలీ హ్యాట్రిక్‌ విజయాలతో యూరో కప్‌ ప్రీ క్వార్టర్స్‌కు  దూసుకెళ్లింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇటలీ మొత్తం 9 పాయింట్లతో గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలిచింది. ఇదే గ్రూప్‌లో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న వేల్స్‌ కూడా రౌండ్‌-16కు చేరుకొంది. ఆదివారం జరిగిన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఇటలీ 1-0తో వేల్స్‌ను ఓడించింది. మాటియో పెస్సీనా (39వ ని మిషం) ఏకైక గోల్‌ సాధించాడు. గ్రూప్‌-ఈలో స్పెయిన్‌, పోలెండ్‌ మధ్య మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

Updated Date - 2021-06-21T10:59:25+05:30 IST