ఫైనల్లో ఇటలీ
ABN , First Publish Date - 2021-07-08T09:22:36+05:30 IST
యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో ఇటలీ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఇటలీ షూటౌట్‌లో 4-2తో స్పెయిన్‌పై గెలుపొంది ఫైనల్లోకి...

- సెమీస్‌లో స్పెయిన్ షూటౌట్
- యూరో చాంపియన్‌షి్‌ప
లండన్: యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో ఇటలీ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఇటలీ షూటౌట్‌లో 4-2తో స్పెయిన్‌పై గెలుపొంది ఫైనల్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు మ్యాచ్ 1-1 స్కోరుతో సమమైంది. తొలి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా చేయని ఇరు జట్లు.. సెకండా్‌ఫలో మాత్రం చెరో గోల్ సాధించాయి. 60వ నిమిషంలో ఫెడిరికో చిసా గోల్‌తో ఇటలీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, ఆట చివర్లో అల్వారో మొరాటా (80వ నిమిషం) గోల్‌తో స్పెయిన్ 1-1తో స్కోరు సమం చేసింది. తర్వాత అదనపు సమయంలోనూ మ్యాచ్ ఫలితం తేలలేదు. షూటౌట్‌లో ఇటలీ జట్టులో ఆండ్రియా బెలోట్టి, లియోనాడ్రో బొనుచీ, ఫెడెరికో బెర్నార్డెస్చి, జోర్గిన్హో గోల్స్ చేసి జట్టును గెలిపించారు. స్పెయిన్‌లో జెరార్డ్ మొరెనో, థియాగో అల్కాంటారా గోల్స్ చేశారు.