రక్తం కారేలా పరీక్షలా..?

ABN , First Publish Date - 2021-01-13T10:33:38+05:30 IST

ఇప్పటికే కఠినమైన నిబంధనలపై షట్లర్లు వ్యతిరేకత వ్యక్తం చేయగా.. తాజాగా కొవిడ్‌ పరీక్షల నిర్వహణ విధానంపై భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రక్తం కారేలా పరీక్షలా..?

నిర్వాహకులపై శ్రీకాంత్‌ ఆగ్రహం

ప్పటికే కఠినమైన నిబంధనలపై షట్లర్లు వ్యతిరేకత వ్యక్తం చేయగా.. తాజాగా కొవిడ్‌ పరీక్షల నిర్వహణ విధానంపై భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్‌ పరీక్షలో భాగంగా శాంపిల్స్‌ సేకరించే క్రమంలో తనతో వైద్యులు దురుసుగా ప్రవర్తించడంతో ముక్కు నుంచి రక్తం కారిందని శ్రీకాంత్‌ వాపోయాడు. రక్తం కారుతున్న ఫొటోను ట్వీట్‌ చేశాడు. తనతో వారు సరైన  రీతిలో వ్యవహరించలేదని, కరోనా పరీక్షలు నిర్వహించే తీరు ఇదేనా? అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాదు.. టోర్నీకి వచ్చే ముందు తాను నాలుగుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

Updated Date - 2021-01-13T10:33:38+05:30 IST