హార్దిక్ పాండ్యా మరోసారి తండ్రి కాబోతున్నాడా..?

ABN , First Publish Date - 2021-12-27T01:01:30+05:30 IST

సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా ఆల్ రౌండర్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు గతేడాది

హార్దిక్ పాండ్యా మరోసారి తండ్రి కాబోతున్నాడా..?

సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా ఆల్ రౌండర్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు గతేడాది జులైలో మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ కుమారుడికి వారు అగస్త్య పాండే అని పేరు పెట్టారు. అయితే హార్దిక్ పాండ్యా మరోసారి తండ్రి కాబోతున్నాడా.. ఈ జంట త్వరలోనే తమ కుటుంబంలోకి  మరొకరిని ఆహ్వానించనున్నాదా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 


ఈ జంట తాజాగా క్రిస్‌మస్ వేడుకలు జరుపుకొంది. ఆ ఫొటోలను పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోల కింద క్యాప్షన్ కూడా రాశాడు. ఆ ఫొటోల్లో నటాషా బేబీ బంప్‌తో ఉండటం నెటిజన్లు గమనించారు. ‘‘ పాండ్యా మరొసారి తండ్రి కాబోతున్నాడు ’’ అని సోషల్ మీడియా యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అతడు మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్‌‌చల్ చెయ్యడం ప్రారంభమయ్యాయి. ఆ ఫొటోలన్ని నెట్టింట వైరల్‌గా మరాయి.Updated Date - 2021-12-27T01:01:30+05:30 IST