వచ్చే ఏడాది ఐపీఎల్ ఎక్కడ జరుగుతుందో చెప్పిన జై షా
ABN , First Publish Date - 2021-11-21T03:02:50+05:30 IST
కరోనా కారణంగా గత రెండు సీజన్లలో ఐపీఎల్ టోర్నీ భారత్కు దూరమైంది. ఈ నేపథ్యంలో

న్యూఢిల్లీ: కరోనా కారణంగా గత రెండు సీజన్లలో ఐపీఎల్ టోర్నీ భారత్కు దూరమైంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ ఎక్కడ జరగబోతోందన్న ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెరదించారు. ఐపీఎల్ 15 సీజన్ ఇండియాలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.
అంతకంటే మరో ముఖ్యమైన విషయం ఈసారి మరో రెండు కొత్త జట్లు అరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పారు. కొత్త జట్ల ఆటగాళ్ల కోసం త్వరలోనే వేలం ఉంటుందని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. సంవత్సరాలుగా చెన్నై సాధిస్తున్న విజయాల ఘనత జట్టు యజమాని ఎన్.శ్రీనివాసన్కే దక్కుతుందన్నారు. కష్ట సమయాల్లోనూ ఆయన జట్టుకు అండగా నిలిచారన్నారు. కాశీ విశ్వనాథ్లాంటి వ్యక్తి జట్టుతో అనుబంధాన్ని పెంచేసుకున్నారని అన్నారు. ప్రతీ సీజన్లోనూ ఆయన జట్టుకు మార్గనిర్దేశనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ధోనీ లాంటి వ్యక్తి జట్టుకు కెప్టెన్గా ఉండగా చెన్నై జట్టును తేలిగ్గా అంచనా వేయలేమ్నారు. చెన్నై జట్టుకు ధోనీ గుండె చప్పుడు లాంటివాడని ప్రశంసించారు. భారత జట్టుకు ధోనీ విజయవంతమైన కెప్టెన్గా నిలిచిపోయాడన్నారు. కాగా, ఐపీఎల్ 2021లో జట్టును విజయ పథంలో నడిపించిన ధోనీ నాలుగోసారి చెన్నైకి టైటిల్ అందించాడు.