సెమీస్‌లో సింధు, శ్రీకాంత్ ఓటమి
ABN , First Publish Date - 2021-11-21T08:32:29+05:30 IST
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో పరాజయం చవిచూశారు. శనివారం

బాలి: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో పరాజయం చవిచూశారు. శనివారం జరిగిన పోరులో సింధు 13-21, 9-21తో టాప్‌సీడ్ యమగూచి (జపాన్) చేతిలో చిత్తయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ కూడా వరుస గేముల్లో 14-21, 9-21తో మూడో సీడ్ ఆండర్స్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.