Tokyo Olympics: తొలి మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు పరాభవం
ABN , First Publish Date - 2021-07-25T01:09:01+05:30 IST
ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లోనే చతికిలపడింది. ప్రపంచ నంబర్ వన్

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లోనే చతికిలపడింది. ప్రపంచ నంబర్ వన్ నెదర్లాండ్స్‌తో కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్‌లో 5-1 గోల్స్ తేడాతో దారుణ ఓటమిని ఎదుర్కొంది. భారత జట్టులో రాణీ రాంపాల్ మాత్రమే తొలి క్వాడ్రంట్లో గోల్ చేసింది. రెండో క్వాడ్రంట్లో గోల్స్ నమోదు కాకపోవడంతో భారత్‌దే పైచేయి అనిపించింది. అయితే, ఆ తర్వాత నెదర్లాండ్స్ దూకుడును భారత జట్టు అడ్డుకోలేకపపోయింది. మూడో క్వాడ్రంట్లో తొలి గోల్ చేసిన తర్వాత ప్రత్యర్థి జట్టు చెలరేగిపోయింది. వరుస గోల్స్‌తో విరుచుకుపడింది. రెండో అర్ధభాగంలో నాలుగు గోల్స్ చేసిన డచ్ జట్టు ప్రారంభ మ్యాచ్‌లో 5-1తో జయకేతనం ఎగురవేసింది.
నెదర్లాండ్ చేతిలో ఓడిన భారత జట్టు నాకౌట్ స్టేజ్‌కు ముందు ఈ నెల 26న జర్మనీ, 28న గ్రేట్ బ్రిటన్, 30న ఐర్లాండ్, 31న దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఆగస్టు 2న నాకౌట్ మొదలవుతుంది.